యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
బీజింగ్ విశ్వ క్రీడలు: అఖిల్ అద్భుత విజయం
బీజింగ్ (ఏజెన్సీ), శనివారం, 16 ఆగస్టు 2008   ( 09:38 IST )
బీజింగ్ విశ్వ క్రీడల్లో భారత బాక్సర్ అఖిల్ అద్భుత విజయం సాధించి ముందుకుసాగుతున్నాడు. ప్రీక్వార్టర్ పైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ సెర్గీ వోడాప్యానోవ్‌ను అఖిల్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఒలింపిక్ పతకాన్ని అందుకోవటానికి అఖిల్ ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. అఖిల్ కుమార్ 54 కిలోల విభాగ బాక్సింగ్ పోరులో వోడాప్యానోవ్‌తో తలపడ్డాడు.

హర్యానాకు చెందిన బాక్సర్ అఖిల్ 2-6 తేడాతో మొదట్లో వెనుకబడ్డాడు. ఆ తర్వాత పంచ్‌లతో వోడాప్యానోవ్‌పై విరుచుకుపడ్డాడు. మూడో రౌండులో అఖిల్ ఆధిక్యంలోకి వచ్చాడు. దీంతో కీలకమైన నాలుగో రౌండులో అఖిల్ విజృంభించి రష్యా వీరుడిని మట్టికరిపించాడు.

అఖిల్ కుమార్ తదుపరి క్వార్టర్ పైనల్ మ్యాచ్‌లో మాల్డోవాకు చెందిన విసెస్లావ్ గొజాన్‌తో ఆదివారం తలపడతాడు. విజయానంతరం అఖిల్ మాట్లాడుతూ విశ్వ ఛాంపియన్‌తో పోరాడటం అంత తేలికైన వ్యవహారం కాదన్నారు. అయితే ఈ సవాలును అధిగమించటంలో తాను సఫలం అయ్యానని అఖిల్ వెల్లడించారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఒలింపిక్స్ డబుల్స్ నుంచి పేస్- భూపతి జోడి నిష్క్రమణ
ఒలింపిక్స్: ఆరో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్న ఫెల్ప్స్
గెలవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి: అభినవ్
బీజింగ్ ఒలింపిక్స్: షూటింగ్‌లో గగన్, సంజీవ్ విఫలం
ఒలింపిక్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి: అభినవ్
లెగ్ మాసన్‌ క్లాసిక్ నుంచి బొపన్నా- ఖురేషి నిష్క్రమణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...