|
| ఒలింపిక్ స్వర్ణ పతకంపై రోజర్ ఫెదరర్ దృష్టి |
| బీజింగ్, 7 ఆగస్టు 2008 ( 16:32 IST ) | |
చైనా ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకునే దానిపై ప్రపంచ నెంబర్‌వన్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ దృష్టి సారించాడు. రోజర్ ఫెదరర్ 27వ జన్మ దినోత్సవాన్ని బుధవారం జరుపుకున్నాడు. ఒలింపిక్ క్రీడల్లో ఆడటం నిజంగా ప్రతి క్రీడాకారుడి కల అని ఫెదరర్ చెప్పాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నాడు.
ఒలింపిక్స్‌లో మెరుగ్గా రాణించటమే తన ముందున్న లక్ష్యమన్నాడు. ర్యాంకుల కంటే ప్రస్తుతం నా దృష్టాంతా ఒలింపిక్స్‌లో మెరుగ్గా రాణించటం పైనే ఉందని స్పష్టం చేశాడు. స్పెయిన్ సంచలనం నాదల్ గత కొంతకాలంగా మెరుగ్గా ఆడుతున్నాడని శ్లాఘించాడు. టెన్నిస్ క్రీడలో అత్యుత్తమ ఆటగాళ్లు అందరూ బీజింగ్‌లో మెరుగ్గా రాణించటంపై దృష్టిపెట్టారని తెలిపాడు.
స్విట్జర్లాండ్ తరపున జాతీయ పతాకాన్ని తాను చేతబూని ఒలింపిక్స్‌లో ముందుకు సాగే అదృష్టం దక్కటం నిజంగా ఒక కల అని వివరించాడు. వరుసగా రెండోసారి ఈ పని చేస్తున్నానని సగర్వంగా చెప్పాడు. సిడ్నీ, ఏథెన్స్ విశ్వ క్రీడల్లో పాల్గొన్నానని తెలిపాడు. టెన్నిస్‌లో తాను స్వర్ణ పతకం గెలుచుకోవాలన్న స్విస్ వాసుల కలను బీజింగ్‌లో నెరవేరుస్తానని ఫెదరర్ అభయమిచ్చాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|