|
| ఆగస్టు 18న పాక్ బౌలర్ ఆసిఫ్ బి శాంపిల్ పరీక్ష |
| కరాచీ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008 ( 12:26 IST ) | |
పాకిస్థాన్ వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆసిఫ్ బి శాంపిల్ పరీక్ష ఈ నెల 18న జరగనుంది. ప్రారంభ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా జరిగిన డోప్ పరీక్షల్లో ఆసిఫ్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఆసిఫ్ తన బి శాంపిల్‌ను కూడా పరీక్షించాలని బీసీసీఐని కోరాడు. ఈ బి శాంపిల్ పరీక్షపై ఏదో ఒక కారణంతో జాప్యం జరుగుతోంది.
తాజాగా ఆసిఫ్ బి శాంపిల్ పరీక్ష తేదీని ఆగస్టు 18కి పొడగించారు. ఆసిఫ్ బి శాంపిల్ పరీక్ష తేదీని మార్చేందుకు అంగీకరిస్తున్నట్టు తమకు ఐపీఎల్ అధికారిక యంత్రాంగం నుంచి ఇ- మెయల్ వచ్చిందని అతని తరపు న్యాయవాది షాహిద్ కరీం తెలిపారు. ఆసిఫ్ బి శాంపిల్ పరీక్ష తేదీ మార్చడం ఇది రెండోసారి.
ఆసిఫ్ విజ్ఞప్తి మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ యంత్రాంగం అతని పరీక్ష తేదీని మరోసారి మార్చేందుకు అంగీకరించింది. షెడ్యూల్ ప్రకారం ఆసిఫ్ బి శాంపిల్ పరీక్ష జులై 28న జరగాల్సి ఉంది. అయితే దీనిని మార్చాలని ఆసిఫ్ నుంచి వచ్చిన తొలి విజ్ఞప్తి మేరకు ఐపీఎల్ తేదీని ఆగస్టు 6కు మార్చింది. అనంతరం ఆసిఫ్ పంపిన రెండో విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకున్న ఐపీఎల్ ఈ తేదీని ఆగస్టు 18కి మార్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా వాడా అధికారులు నిర్వహించిన డోప్ పరీక్షల్లో ఆసిఫ్ పాజిటివ్‌గా తేలడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనిపై నిరవధిక నిషేధం విధించింది. అనంతరం ఆసిఫ్ తన బి శాంపిల్‌ను పరీక్షించాలని కోరాడు. అయితే అతనికి ఇప్పటివరకు స్విజ్జర్లాండ్‌లోని జెనీవా వెళ్లేందుకు వీసా లభించలేదు. జెనీవాలో ఆసిఫ్ బి శాంపిల్ పరీక్ష నిర్వహిస్తారు. శుక్రవారానికి తమకు వీసాలు లభించే అవకాశం ఉందని కరీం నమ్మకం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|