యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
శ్రీలంకలో రెండో సిరీస్ విజయంపై టీం ఇండియా కన్ను
కొలంబో, 7 ఆగస్టు 2008   ( 11:38 IST )
గాలె టెస్ట్ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసిన టీం ఇండియా శ్రీలంకలో రెండో సిరీస్ విజయంపై దృష్టి పెట్టింది. అయితే సీనియర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఫామ్‌లో లేకపోవడం భారత్‌ను కలవరపెడుతోంది. శ్రీలంక- భారత్ చివరి టెస్ట్ మ్యాచ్ శుక్రవారం కొలంబోలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండు జట్లు చెరొక విజయం సాధించి సమవుజ్జీలుగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో శ్రీలంకపై ఎదురైన ఇన్నింగ్స్ పరాజయానికి, భారత్ గాలెలో జరిగిన రెండో టెస్ట్‌లో ప్రతీకారం తీర్చుకుంది. వీరేంద్ర సెహ్వాగ్ (201, 50) బ్యాటుతో, హర్భజన్ సింగ్ (10 వికెట్లు) బంతితోనూ రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇదిలా ఉంటే భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటివరకు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. శ్రీలంకలో టీం ఇండియా రెండో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే ఈ నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్ ఆఖరి టెస్ట్‌లో రాణించాల్సి ఉంది. భారత్ 1993లో తొలిసారి, చివరిసారి శ్రీలంకలో 1-0తో సిరీస్ విజయాన్ని సాధించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేను నిర్దోషిని: డోప్ ఆరోపణలపై మోనికా దేవి
ఐపీఎల్ ధనార్జనలోనే మిన్న: ఐసీఎల్ ఛైర్మన్ కపిల్
గాలె పరాజయం: శ్రీలంక దిద్దుబాటు చర్యలు
టీం ఇండియా కోచ్ కిర్‌స్టన్ దక్షిణాఫ్రికా పయనం
ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 చేర్చాలి: క్రికెటర్ల అభిలాష
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానానికి దిగజారిన సానియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...