|
| నేను నిర్దోషిని: డోప్ ఆరోపణలపై మోనికా దేవి |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008 ( 17:38 IST ) | |
భారత వెయింట్‌లిఫ్టింగ్ సమాఖ్య మద్దతుగా నిలవడంతో మోనికా దేవి బుధవారం తనపై వచ్చిన డోప్ ఆరోపణలపై నోరువిప్పారు. తాను నిర్దోషినని చెప్పారు. తనపై వచ్చిన డోప్ ఆరోపణలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని కొందరు సభ్యుల కుట్రే కారణమని ఆరోపించారు.
ఆగస్టు 8న ప్రారంభమయ్యే బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో భారత్ తరపున పాల్గొంటున్న ఒకేఒక్క వెయిట్‌లిఫ్టర్ మోనికా దేవి అయిన సంగతి తెలిసిందే. అయితే ఈమెపై డోప్ ఆరోపణలు రావడంతో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత ప్రాతినిథ్యం లేకుండా పోయింది. మిగిలిన భారత ఒలింపిక్ జట్టు మంగళవారం రాత్రి బీజింగ్ విమానమెక్కింది. మోనికా దేవి మాత్రం ఈ ఆరోపణలు రావడంతో ఇక్కడే ఉండిపోయారు.
డోప్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో మోనికా దేవిని బీజింగ్ ఒలింపిక్స్‌కు వెళ్లకుండా ఆపారు. మోనికా నిషేధిత ఉత్ప్రేరకంగా పరిగణించబడే ఒకరకమైన ఉప్పు వాడినట్టు పరీక్షల్లో తేలినట్టు వార్తలు వచ్చాయి. దీంతో మోనిక బీజింగ్ ప్రయాణం నిలిచిపోయింది. దీనిపై మోనిక మాట్లాడుతూ తాను ఏ డోప్ పరీక్షలో దొరికానో తెలియదన్నారు. గత రెండు నెలల్లో నాలుగు డోప్ పరీక్షలు పూర్తి చేశానని తెలిపారు.
నేను అమాయకురాలిని. డోపింగ్‌కు ఎప్పుడూ దూరంగా ఉంటూ వచ్చాను. అందువలనే తాను ట్రయిల్స్‌లో బీజింగ్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యానని న్యూఢిల్లీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మోనికా దేవి వెల్లడించారు. బీజింగ్ వెళ్లేందుకు తాను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అక్కడ గురువారం జరిగే డోప్ పరీక్షల్లో దొరికితే, తనను జీవితాంతం వెయిట్‌లిఫ్టింగ్‌లోకి అడుగుపెట్టకుండా నిషేధించాలని, బహిరంగంగా కాల్చిచంపాలని కోరారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|