|
| గాలె పరాజయం: శ్రీలంక దిద్దుబాటు చర్యలు |
| కొలంబో (ఏజెన్సీ), 6 ఆగస్టు 2008 ( 12:39 IST ) | |
గాలెలో జరిగిన రెండో టెస్ట్‌లో పరాజయం అనంతరం శ్రీలంక జట్టు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. శ్రీలంక క్రికెట్ బోర్డు తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ప్రభావం చూపని ఆటగాళ్లపై వేటు వేయాలని భావిస్తోంది.
దిద్దుబాటు చర్యల్లో భాగంగా శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమిందావాస్, కులశేకరలతో కూడిన ఫాస్ట్ బౌలింగ్ విభాగంతో శ్రీలంక ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది.
ఇదిలా ఉంటే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో విఫలం అయిన ఓపెనర్ వందోర్త్‌ను కూడా మూడో టెస్ట్ జట్టులో తొలగించే అవకాశాలున్నాయి. జట్టులో కులశేఖర స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోవడంపై, వందోర్త్ స్థానంలో వేరొక బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయడంపై శ్రీలంక సెలక్షన్ కమిటీ చర్చలు జరుపుతోంది.
కులశేఖరపై వేటు వేస్తే టెస్ట్ సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టిన ఫాస్ట్ బౌలర్ దమ్మికా ప్రసాద్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారత్ ఓపెనర్లపై ప్రభావం చూపలేని కులశేఖర స్థానంలో ప్రసాద్‌ను జట్టులోకి తీసుకోవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|