యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 చేర్చాలి: క్రికెటర్ల అభిలాష
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 6 ఆగస్టు 2008   ( 11:01 IST )
ఒలింపిక్ క్రీడల్లో ట్వంటీ- 20 క్రికెట్‌కు చోటు కల్పించాలని పలువురు క్రికెటర్లు అభిలషించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ ఈ ప్రతిపాదన చేసిన తరువాతి రోజే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, పాక్ క్రికెటర్లు యూనిస్ ఖాన్, షోయబ్ మాలిక్‌, న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని అభిప్రాయపడ్డారు. ఐసీసీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇందుకు సంబంధించిన మార్గాన్ని కనిపెట్టాలని పిలుపునిచ్చారు.

ఒలింపిక్ షెడ్యూల్‌కు క్రికెట్ కూడా సరిపోతుందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా ట్వంటీ- 20 క్రికెట్‌ను 2012 లేదా 2016 ఒలింపిక్ క్రీడల్లో చేర్చే లక్ష్యంతో పనిచేస్తుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడటం ఆటగాళ్లకు కూడా గొప్పగా ఉంటుందని క్రికెటర్లు తెలిపారు. ఒలింపిక్ క్రీడగా క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడానికి ఇంతకుముందు ఆట నిడివి ఇబ్బందికరంగా ఉండేది. ట్వంటీ- 20 క్రికెట్ రావడంతో ఈ సమస్య కూడా తీరిపోయిందన్నారు. ప్రపంచంలో మొదటి ఐదు పెద్ద క్రీడల్లో క్రికెట్ కూడా ఒకటి. దీనికి ఒలింపిక్స్‌లో చోటు ఉండాలన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానానికి దిగజారిన సానియా
టీం ఇండియా వన్డే జట్టు ఎంపిక ఒకరోజు వాయిదా
ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్
ఒలింపిక్స్‌లో ట్వంటీ- 20 క్రికెట్ చేర్చండి: గిల్‌క్రిస్ట్
భారత ఒలింపిక్ జట్టుకు రాజ్యవర్ధన్ రాథోడ్ నేతృత్వం
వాన్, వుడ్ రాజీనామా: ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ పీటర్సన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...