|
| ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానానికి దిగజారిన సానియా |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 12:44 IST ) | |
భారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ర్యాంకుల పతనం కొనసాగుతుంది. తాజాగా సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానానికి చేరుకుంది. గత వారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు దిగజారి 50వ స్థానానికి పడిపోయిన సానియా, తాజా ర్యాంకింగ్స్‌లో మరో 10 స్థానాలు కోల్పోయింది.
ఈ ఏడాది టెన్నిస్‌లో సానియా మీర్జా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన సానియా, తిరిగి కోర్టుల్లోకి వచ్చిన తరువాత ఫామ్ దొరకబుచ్చుకొనేందుకు ఇబ్బంది పడుతుంది. పేలవమైన ప్రదర్శనతో ర్యాంకుల్లోనూ పతనాలు చవిచూస్తోంది.
ఇదిలా ఉంటే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మాత్రం సానియా ర్యాంకు పదిలంగా ఉంది. ఇంతకుముందు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ 26వ స్థానంలో ఉన్న సానియా, తాజా ర్యాంకింగ్స్‌లో ఇదే స్థానాన్ని నెలబెట్టుకుంది. మహేష్ భూపతి తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపురుచుకొని తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు. లియాండర్ పేస్ (15వ ర్యాంకు) ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|