|
| టీం ఇండియా వన్డే జట్టు ఎంపిక ఒకరోజు వాయిదా |
| ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 12:35 IST ) | |
శ్రీలంకలో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపికచేసేందుకు సెలెక్షన్ కమిటీ ఈ నెల 7న సమావేశం కానుందని బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ సిరీస్‌కు వన్డే జట్టును బుధవారం ఎంపిక చేస్తామని బీసీసీఐ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం జట్టు ఎంపికను ఒకరోజు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా వెల్లడించారు. జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుందని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టును కూడా అదే రోజు ఎంపిక చేసే అవకాశం ఉందన్నారు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ ఆగస్టు 18న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|