|
| భారత ఒలింపిక్ జట్టుకు రాజ్యవర్ధన్ రాథోడ్ నేతృత్వం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 10:56 IST ) | |
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల రోజున భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూనే అవకాశం రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు దక్కింది. భారత ఒలింపిక్ జట్టు సారథ్య బాధ్యతలను రాథోడ్‌కు అప్పగించారు. బీజింగ్ ఒలింపిక్స్ ఈ నెల 8న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు దక్కిన ఒకే ఒక్క రజత పతకాన్ని రాథోడ్ సాధించిపెట్టాడు.
రాథోడ్‌కు భారత్ ఒలింపిక్ జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించామని, ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత పతాకాన్ని చేతబూనిన రాథోడ్‌ను మిగిలిన క్రీడాకారులు అనుసరిస్తారని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సారథిగా అథ్లెటిక్ స్టార్ అంజూ బాబీ జార్జి వ్యవహరించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|