|
| వాన్, వుడ్ రాజీనామా: ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ పీటర్సన్ |
| లండన్ (ఏజెన్సీ), మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 10:40 IST ) | |
ఇంగ్లాండ్ టెస్ట్, వన్డే కెప్టెన్లు మైకెల్ వాన్, పాల్ కాలింగ్‌వుడ్ అనూహ్యంగా రాజీనామాలు చేయడంతో, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆ బాధ్యతలను కెవిన్ పీటర్సన్‌కు అప్పగించింది. ఇంగ్లాండ్ టెస్ట్, వన్డే జట్లకు కొత్త కెప్టెన్‌గా కెవిన్ పీటర్సన్‌ను నియమిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది.
దక్షిణాఫ్రికాతో ఒవెల్‌లో గురువారం ప్రారంభమయ్యే చివరి టెస్ట్ మ్యాచ్‌లో కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ జట్టుకు నేతృత్వం వహిస్తాడు. ఈ మ్యాచ్‌తోనే పీటర్సన్ కెప్టెన్సీ శకం ప్రారంభం కానుంది. మైకెల్ వాన్, పాల్ కాలింగ్‌వుడ్ ఆదివారం కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగారు.
ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పటివరకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినవారిలో పీటర్సన్ 78వ ఆటగాడు. 131 ఏళ్ల చరిత్ర ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఇప్పటివరకు జట్టు పగ్గాలు 78 మంది చేతులు మారగా, ఇంగ్లాండ్‌తోపాటు క్రికెట్ ఆడటం ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పటివరకు 42 మంది మాత్రమే కెప్టెన్లుగా వ్యవహరించారు.
దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన క్రికెటర్లలో కెవిన్ పీటర్సన్ నాలుగో వ్యక్తి. ఇంతకుముందు టోనీ గ్రెగ్, అలన్ ల్యాంబ్, ఆండ్ర్యూ స్ట్రాస్ కూడా పీటర్సన్ మాదిరిగానే ఇంగ్లాండ్ కెప్టెన్లుగా వ్యవహరించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|