|
| రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ధోనీ ఎంపిక |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 4 ఆగస్టు 2008 ( 18:04 IST ) | |
టీం ఇండియా వన్డే, ట్వంటీ- 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోమవారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యాడు. దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే. మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తరువాత ఈ అవార్డును అందుకుంటున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కావడం గమనార్హం.
ఇప్పటివరకు క్రికెటర్లలో సచిన్ ఒక్కడినే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వరించింది.
మిల్కా సింగ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సోమవారం సమావేశమై అవార్డుకు వచ్చిన నామినేషన్లను పరిశీలించింది. గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టుకు నేతృత్వం వహించిన ధోనీకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందజేయాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 20 తరువాత వెలువడనుందని తెలిపారు. ఇదిలా ఉంటే బీసీసీఐ సీఏవో రత్నాకర్ శెట్టి ఈ అవార్డుకు ధోనీని ఎంపికచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|