యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
మెంజ్ టైటిల్‌ను 11వసారి చేజిక్కించుకున్న ఆనంద్
మాస్కో (ఏజెన్సీ), సోమవారం, 4 ఆగస్టు 2008   ( 16:22 IST )
భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 13వ గ్రెంకెలీజింగ్ రాపిడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే)పై విజయం సాధించాడు. క్లాసికల్ చెస్‌ ప్రపంచ ఛాంపియన్‌గా ఆధిపత్యం చెలాయిస్తున్న విశ్వనాథన్ ఆనంద్ నాలుగు గేమ్‌ల ఫైనల్స్‌లో తొలి రెండు గేమ్‌ల్లో విజయం సాధించాడు. అనంతరం మూడో గేమ్‌ను డ్రాగా ముగించి టైటిల్ చేజిక్కించుకున్నాడు.

మైంజ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్‌కు ఇది 11వ టైటిల్ కావడం గమనార్హం. నలుగురు క్రీడాకారులు పాల్గొన్న ఈ రౌండ్ రాబిన్ ఛాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ ఫైనల్స్‌కు ముందు అలెగ్జాండర్ మోరోజెవిచ్‌పై రెండుసార్లు విజయం సాధించాడు. కార్ల్‌సెన్, జుడిత్ పోల్గార్‌లతో జరిగిన గేమ్‌లను డ్రాగా ముగించాడు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో మొదటి రెండు స్థానాల్లో విశ్వనాథన్ ఆనంద్, కార్ల్‌సెన్ నిలవగా, చివరి రౌండు మ్యాచ్‌లో జుడిట్ పోల్గార్‌పై విజయం సాధించిన ప్రపంచ నెంబర్‌టూ క్రీడాకారుడు మోరోజెవిచ్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తొలి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న ముర్రే
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు 160,000 మంది: చైనా
నార్త్ ఉరల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన హంపి
మైంజ్ చెస్ ఫైనల్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆనంద్
బీజింగ్ ఒలింపిక్స్ పతకంపై కన్నేసిన రఫెల్ నాదల్
వివాదాల గాయాల నుంచి బయటపడ్డా: భజ్జీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...