|
| తొలి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న ముర్రే |
| సిన్సిన్నాటి (ఏజెన్సీ), సోమవారం, 4 ఆగస్టు 2008 ( 16:08 IST ) | |
సిన్సిన్నాటి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆండీ ముర్రే కైవసం చేసుకున్నాడు. ఆండో ముర్రే సొంతం చేసుకున్న తొలి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ ఇదే కావడం గమనార్హం. నోవాక్ జకోవిచ్ (సెర్బియా)తో ముర్రే టైటిల్ పోరులో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ముర్రే (స్కాట్లాండ్) 7-6 (4), 7-6 (5) తేడాతో జకోవిచ్‌పై విజయం సాధించాడు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్‌కు ఫైనల్స్‌లో ఓటమిపాలై అభిమానులను నిరాశపరిచాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌టూ క్రీడాకారుడు రఫెల్ నాదల్‌ను ఓడించి జకోవిచ్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నాదల్ మరో రెండు వారాల్లో ప్రకటించబోయే టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించుకోబోతున్నాడు.
సిన్సిన్నాటి సెమీస్‌లో జకోవిచ్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ నాదల్ ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకు సాధించడానికి అవసరమైన పాయింట్లను ఈ టోర్నీ ద్వారా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో గత నాలుగేళ్లుగా (ఫిబ్రవరి 2, 2004) ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఫెదరర్ తొలిసారి ఒక మెట్టు కిందకు దిగబోతున్నాడు. నాదల్ గత మూడేళ్లుగా ప్రపంచ నెంబర్‌టూ స్థానంలో ఉండటం గమనార్హం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|