యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
సెంచరీలతో కదం తొక్కిన లంక : 422/4
కొలంబో (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 09:57 IST )
భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక ఆటగాళ్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఈ టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక తమ బ్యాట్స్‌మెన్ వీరవిహారంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 422 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముగ్గురు శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ సెంచరీలు పూర్తి చేసుకోవడం రెండోరోజు ఆటలో విశేషం.

ఓవర్‌నైట్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులతో గురువారం రెండోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ వర్నపుర, జయవర్ధనేలు ప్రారంభం నుంచి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. దీనికి తోడు భారత ఫీల్డర్ పేలవమైన ఫీల్డింగ్‌తో ఈ జంట రెచ్చిపోయి బ్యాటింగ్ చేసింది.

ఈ దశలో సెంచరీ పూర్తిచేసుకున్న వర్నపుర (115)ను ఎట్టకేలకు హర్భజన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుతిరిగాడు. అనంతరం జయవర్థనేకు జతకలిసిన సమరవీర సైతం స్వేచ్ఛగా బ్యాట్ జులీపించాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ దశలో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జయవర్ధనే (136) నాలుగో వికెట్‌గా క్రీజు నుంచి నిష్క్రమించాడు.

అనంతరం సమరవీర సైతం (111 నాటౌట్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 422 పరుగులు సాధించింది. సమరవీర (111)తో కలిసి దిల్షాన్ (20) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా జహీర్‌ఖాన్, హర్భజన్‌సింగ్‌లు చెరో వికెట్ సాధించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ : ఐసీసీ
అంఫైర్ నిర్ణయానికి తొలి సవాల్ : కుంబ్లే రికార్డ్
ఒలింపిక్‌ క్రీడల్లో భారత క్రీడాకారుల వాటా 57
యూవీలో బాధ్యతారాహిత్యం లేదు: చేతన్ చౌహాన్
రోజర్స్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భూపతి- నౌల్స్
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ నుంచి సానియా నిష్క్రమణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...