|
| పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ : ఐసీసీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008 ( 09:35 IST ) | |
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇన్నాళ్లు నెలకొన్న ప్రతిష్టంభనకు ఐసీసీ గురువారం తెరదించింది. సెప్టెంబర్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్‌నే వేదికగా ఐసీసీ ఖరారు చేసింది.
భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో ఆడడానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాలు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మారే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ విషయమై గురువారం దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన టెలీ కాన్ఫరెన్స్ సమావేశంలో ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది.
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నట్టు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త తెలిసిన వెంటనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఆనందం వ్యక్తం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు పాకిస్థాన్‌ను వేదికగా ఎంపిక చేసినందుకు పాక్ క్రికెట్ బోర్డ్ ఐసీసీకి కృతజ్ఞత తెలిపింది.
అలాగే ఈ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన భారత క్రికెట్ బోర్డ్‌కు సైతం పీసీబీ తన కృతజ్ఞతలు తెలియజేసింది. ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా పీసీబీ ఛైర్మన్ నసీమ్ అష్రఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|