యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
అంఫైర్ నిర్ణయానికి తొలి సవాల్ : కుంబ్లే రికార్డ్
కొలంబో (ఏజెన్సీ), 25 జులై 2008   ( 09:21 IST )
ఐసీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన అంఫైర్ నిర్ణయం పునఃసమీక్షించకోరే రిఫరల్ విధానాన్ని ఉపయోగించుకున్న తొలి క్రికెటర్‌గా కుంబ్లే రికార్డు సృష్టించాడు. అలాగే ఈ రిఫరల్ విధానంలో విజయం సాధించిన తొలి ఆటగాడిగా దిల్షాన్ రికార్డు సాధించాడు.

అంఫైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే రిఫరల్ విధానాన్ని భారత్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని గురువారం నాటి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక ఆటగాళ్లు ఇద్దరూ ఉపయోగించుకున్నారు.

అయితే అంఫైర్ నిర్ణయంపై పునఃసమీక్ష కోరిన కుంబ్లే ఆ విషయంలో విజయం మాత్రం సాధించలేక పోయాడు. హర్భజన్ బౌలింగ్‌లో శ్రీలంక ఆటగాడు వర్నపుర ఎల్బీ కోసం భారత క్రీడాకారులు చేసిన అప్పీలును అంఫైర్ బెన్సన్ తిరస్కరించడంతో కుంబ్లే రిఫరల్ విధానాన్ని అశ్రయించాడు.

అయితే మూడో అంఫైర్ సైతం బెన్సన్ నిర్ణయాన్నే సమర్థించాడు. అలాగే మరోసారి సైతం కుంబ్లే రిఫరల్ కోసం ప్రయత్నించగా మళ్లీ నిరాశే ఎదురైంది. అదేసమయంలో హర్భజన్ బౌలింగ్‌లో తనను క్యాచ్ అవుట్‌గా అంఫైర్ ప్రకటించడాన్ని సవాల్ చేసిన శ్రీలంక ఆటగాడు దిల్షాన్ రిఫరల్ విధానం ద్వారా విజయం సాధించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ : ఐసీసీ
ఒలింపిక్‌ క్రీడల్లో భారత క్రీడాకారుల వాటా 57
యూవీలో బాధ్యతారాహిత్యం లేదు: చేతన్ చౌహాన్
రోజర్స్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భూపతి- నౌల్స్
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ నుంచి సానియా నిష్క్రమణ
ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ బోర్డుకు బీసీసీఐ మద్దతు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...