యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ నుంచి సానియా నిష్క్రమణ
లాస్ ఏంజెల్స్ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008   ( 14:20 IST )
భారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా రెండో రౌండు పరాజయంతో ఆరు లక్షల డాలర్ల ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ టోర్నమెంట్ సింగిల్స్ నుంచి నిష్క్రమించింది. మెంగ్ యువాన్‌తో సానియా మీర్జా రెండో రౌండు మ్యాచ్‌లో తలపడింది.

ఈ మ్యాచ్‌లో 16వ సీడ్ సానియా మీర్జా 4-6 3-6 తేడాతో అన్‌సీడెడ్ మెంగ్ యువాన్ (చైనా) చేతిలో పరాజయం పాలై అభిమానులను నిరాశపరిచింది. భారత్ తరపున టెన్నిస్‌లో పతకం గెలిచే సామర్థ్యం ఉన్న ఒకేఒక్క క్రీడాకారిణిగా సానియాపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో సానియా ఇప్పటికీ బరిలో ఉంది. మాటెక్‌తో జోడి కట్టిన సానియా ఈ టోర్నీ డబుల్స్ తొలి రౌండు మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే గత వారం జరిగిన స్టాన్‌ఫోర్డ్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌‌లో బ్రిటిష్ క్వాలిఫైయర్ చేతిలో పరాజయం పాలై సానియా సింగిల్స్ తొలి రౌండు నుంచే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ బోర్డుకు బీసీసీఐ మద్దతు
తొలి టెస్ట్: వర్నపుర అర్ధ సెంచరీతో శ్రీలంక 85/2
ఛాంపియన్స్ ట్రోఫీపై గురువారం ఐసీసీ నిర్ణయం
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ క్వార్టర్స్‌లో సానియా- మాటెక్
శ్రీలంక- భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
అర్జున అవార్డుల అప్లికేషన్లు మాకు రాలేదు: బీసీసీఐ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...