యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ బోర్డుకు బీసీసీఐ మద్దతు
కరాచీ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008   ( 14:15 IST )
పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై తమకెటువంటి అభ్యంతరం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడంపై గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు తుది నిర్ణయం తీసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ మద్దతు తెలిపింది.

ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా తెలిపారు. కొన్ని దేశాల బోర్డులు పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్కడ జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు విముఖత చూపుతున్నాయి. అయితే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తదితర దేశాల బోర్డుల ఆందోళలను సమంజసం అనిపించడం లేదని నిరంజన్ షా పేర్కొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ కూడా తన నివేదికలో పాకిస్థాన్‌లో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమకు ఎటువంటి సమస్యలు కనిపించడం లేదని ఆ దేశానికి చెందిన ఒక ఛానల్‌తో మాట్లాడుతూ నిరంజన్ షా వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తొలి టెస్ట్: వర్నపుర అర్ధ సెంచరీతో శ్రీలంక 85/2
ఛాంపియన్స్ ట్రోఫీపై గురువారం ఐసీసీ నిర్ణయం
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ క్వార్టర్స్‌లో సానియా- మాటెక్
శ్రీలంక- భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
అర్జున అవార్డుల అప్లికేషన్లు మాకు రాలేదు: బీసీసీఐ
టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్: సచిన్ ర్యాంకు పతనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...