యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
తొలి టెస్ట్: వర్నపుర అర్ధ సెంచరీతో శ్రీలంక 85/2
కొలంబో (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008   ( 08:49 IST )
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు చేజార్చుకొని 85 పరుగులు చేసింది. ముందురోజు రాత్రి వర్షం కారణంగా సింహళీస్ స్టోర్ట్స్ క్లబ్ మైదానం తడిసిముద్దవడంతో మొదటిరోజు రెండు సెషన్లు మ్యాచ్ జరగలేదు. మూడో సెషన్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను ఓపెనర్ వర్నపురా అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు.

మరో ఓపెనర్ వందోర్త్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఇషాంత్ శర్మకు దొరికిపోయాడు. ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ చివరి బంతికి వందోర్త్ భారత కీపర్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవీలియన్ దారిపట్టాడు. అనంతరం వర్నపురాకు జతకలిసిన సంగక్కరా (12) జహీర్ ఖాన్ బౌలింగ్‌లో ద్రావిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది.

వర్నపురా, సంగక్కరా రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వెలుతురు సరిగా లేకపోవడంతో 22 ఓవర్లు జరిగిన అనంతరం అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపివేశారు. క్రీజ్‌లో వర్నపుర 50 పరుగులతో, లంక కెప్టెన్ మహేల జయవర్దనే 16 పరుగులతో నాటౌట్‌లుగా ఉన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఛాంపియన్స్ ట్రోఫీపై గురువారం ఐసీసీ నిర్ణయం
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ క్వార్టర్స్‌లో సానియా- మాటెక్
శ్రీలంక- భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
అర్జున అవార్డుల అప్లికేషన్లు మాకు రాలేదు: బీసీసీఐ
టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్: సచిన్ ర్యాంకు పతనం
బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...