యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఛాంపియన్స్ ట్రోఫీపై గురువారం ఐసీసీ నిర్ణయం
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 23 జులై 2008   ( 14:06 IST )
ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యంపై నెలకొన్న వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు గురువారం పరిశీలించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌కు ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనే దానిపై ఐసీసీ గురువారంనాటి సమావేశంలో తుది నిర్ణయం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులపై వివిధ దేశాల ఆటగాళ్లు, బోర్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరగబోతున్న అతిపెద్ద వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ నిర్వహణ బాధ్యతలు పాకిస్థాన్‌ చేతుల్లో ఉంటాయా లేదా అనేది గురువారం జరిగే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో తేలనుంది.

షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ సెప్టెంబర్ 11 నుంచి 18వరకు పాకిస్థాన్‌లో జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో పాకిస్థాన్‌తో కూడిన టాప్- 8 దేశాలు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ దేశాలు పాక్‌లో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ దేశంలో క్రికెటర్లకు ఎటువంటి హానీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ క్వార్టర్స్‌లో సానియా- మాటెక్
శ్రీలంక- భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
అర్జున అవార్డుల అప్లికేషన్లు మాకు రాలేదు: బీసీసీఐ
టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్: సచిన్ ర్యాంకు పతనం
బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం
చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...