|
| ఫిట్‌నెస్ అంటే పరిగెత్తడం కాదు: గంగూలీ |
| కొలంబో (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008 ( 15:35 IST ) | |
ఫిట్‌నెస్ అంటే బాగా పరిగెత్తడం, బరువులెత్తగలడం కాదని, క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు, సాధారణ ఫిట్‌నెస్‌కు చాలా తేడా ఉందని టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. టీం ఇండియా బలహీనతల్లో ఫీల్డింగ్ ఒకటని మాజీ కెప్టెన్ గంగూలీ చెప్పాడు.
సాధారణ ఫిట్‌నెస్ పరిధిలో క్రికెటర్లు ఉండాల్సిన అవసరం లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. బరువులెత్తుతూ, బాగా పరిగెత్తితేనే క్రికెట్ ఫిట్‌నెస్ ఉన్నట్టు కాదన్నాడు. సాధారణ పిట్‌నెస్‌తో పోలిస్తే క్రికెట్ ఫిట్‌నెస్ పూర్తిగా భిన్నమైందని చెప్పాడు. క్రికెట్ బాగా ఆడతూ ఉంటే ఫిట్‌గా ఉన్నట్టేనని గంగూలీ తెలిపాడు.
విశ్రాంతి కావాలని కోరుతూ శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయవద్దని టీం ఇండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీసుకున్న నిర్ణయంపై స్పందించేందుకు గంగూలీ నిరాకరించాడు. ధోనీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డాడు. ధోనీ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమిది. దీనిపై స్పందించే హక్కు తనకు లేదని గంగూలీ తెలిపాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|