యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
జూనియర్ హాకీ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 14:38 IST )
ఆసియా జూనియర్ హాకీ ఛాంపియన్‌గా నిలిచినందుకై భారత యువ జట్టును రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ శనివారం అభినందించారు. ఉత్కంఠభరిత క్షణాల్లో చక్కటి పోరాట పటిమను ప్రదర్శించగలమనే విషయాన్ని యువజట్టు నిరూపించిందని ఆమె కొనియాడారు.

ఢిల్లీలో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ టోర్నీ ఆద్యంతం చక్కగా రాణించి, జట్టు విజయానికి తోడ్పడిన యువ డ్రాగ్ ఫ్లిక్కర్ దివాకర్ రామ్‌తో పాటు కోచ్ ఏకే బన్సాల్‌లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత యువజట్టు 3-2 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ ఫైనల్లో 0-2తో వెనుకబడిన స్థితిలో భారత్ ఒక్కసారిగా పుంజుకుని మూడు గోల్స్ చేయడం ద్వారా రెండో పర్యాయం ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మూడు గోల్స్‌లో రెండు దివాకర్ రామ్ చేసివవే కావడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం ప్రోటీస్ తంటాలు
శ్రీలంక బోర్డు లెవన్ 224 ఆలౌట్
కొరియాపై విజయంతో మళ్లీ విజేతగా భారత్
భారత క్రీడాకారిణిలకు బికినీల నుంచి మినహాయింపు
అసిఫ్ ఏం తీసుకున్నాడో మాకు తెలియదు: పీసీబీ
అప్టోస్ ఏటీపీ ఛాలెంజర్‌లో టాప్ సీడ్‌కు ప్రకాశ్ షాక్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...