|
| మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం ప్రోటీస్ తంటాలు |
| లీడ్స్ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 11:45 IST ) | |
లీడ్స్‌లో జరిగే రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను 203 పరుగులకు ఆలౌట్ చేసిన ప్రోటీస్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం తంటాలు పడుతోంది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
ఓపెనర్లుగా బరిలో దిగిన నీల్ మెకంజీ (15), గ్రేమ్ స్మిత్ (44)లతో పాటు జాక్ కల్లిస్ (4)లు ఇప్పటికే పెవిలియన్ బాట పట్టగా, ప్రస్తుతం ఆమ్లా (18), ప్రిన్స్ (9)లు బరిలో దిగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఫ్లింటాఫ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు ఇంగ్లాండ్ 203 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో పీటర్సన్ (45), ఇయాన్ బెల్ (31)లు మినహా మరెవ్వరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలు స్టెయిన్, మోర్కెల్‌లు అద్భుతంగా రాణించి నాలుగేసి వికెట్లు దక్కించుకోగా, ఎన్తిని, కల్లిస్‌లకు చెరో వికెట్ దక్కాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|