యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
కొరియాపై విజయంతో మళ్లీ విజేతగా భారత్
హైదరాబాద్‌ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008   ( 11:14 IST )
హైదరాబాద్‌లో జరిగిన ఆసియా జూనియర్ కప్ హాకీ టోర్నీలో భారత్ రెండో పర్యాయంగా ఛాంపియన్ కిరీటాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన హోరాహోరీ పోరులో చివరి నిమిషంలో దివాకర్ రామ్ సృష్టించిన అద్భుతంతో భారత్ ఛాంపియన్ కప్‌ను ఎగరేసుకుపోయింది.

టోర్నీ ఆద్యంతం భారత్ అద్భుతంగా రాణించినప్పటికీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో కొరియాదే ఆధిక్యంగా కన్పించింది. 52వ నిమిషంలో కొరియా 0-2 ఆధిక్యంతో ఉండగా, ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. 2-2కు చేరిన సమయంలో దివాకర్ రామ్ ఓ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి, భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

ఈ గోల్ చేసిన వెంటనే భారత ఆటగాళ్లతో పాటు గ్యాలరీలలో ఉన్న వాళ్లు సైతం కేరింతలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో దివాకర్ రామ్ రెండు గోల్స్ చేయగా, సునీల్ ఎస్పీ మరో గోల్ చేశాడు. కాగా జపాన్‌పై విజయం సాధించడం ద్వారా పాక్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత క్రీడాకారిణిలకు బికినీల నుంచి మినహాయింపు
అసిఫ్ ఏం తీసుకున్నాడో మాకు తెలియదు: పీసీబీ
అప్టోస్ ఏటీపీ ఛాలెంజర్‌లో టాప్ సీడ్‌కు ప్రకాశ్ షాక్
కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్న మెండిస్
ఇండియానాపోలిస్ క్వార్టర్స్‌లో చేతులెత్తేసిన బొపన్నా జోడి
అసిఫ్ నాండ్రోలిన్ వాడినట్టు నిర్ధారణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...