|
| బి శాంపిల్ కోసం విజ్ఞప్తి పంపిన మహ్మద్ అసిఫ్ |
| కరాచీ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008 ( 12:39 IST ) | |
పాకిస్థాన్ వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అసిఫ్ బుధవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారులను బి శాంపిల్‌ను పరీక్షించాలని విజ్ఞప్తి పంపాడు. అసిఫ్ తరపు న్యాయవాది షాహిద్ కరీం ఈ విషయాన్ని వెల్లడించారు. బి శాంపిల్‌ను పరీక్షించాలని కోరుతూ ఐపీఎల్ నిర్వాహక కమిటీకి ఇ- మెయిల్ పంపామని తెలిపారు.
మొదటి పరీక్షలో పాజిటివ్‌గా తేలినప్పటికీ, బి శాంపిల్‌ను పరీక్షించాలని అడిగే హక్కు అసిఫ్‌కు ఉందని న్యాయవాది తెలిపారు. ఈ రెండో పరీక్ష అసిఫ్‌ను డోపింగ్ కష్టాల నుంచి బయటపడేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మొదటి పరీక్షలో తప్పుజరిగిందని ఈ పరీక్షలో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా జరిపిన డోప్ పరీక్షల్లో అసిఫ్ ఒక్కడే పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. అసిఫ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తెలియడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మంగళవారం అతనిపై నిరవధిక నిషేధం విధించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|