|
| ఆసియా కప్: పాక్‌పై విజయంతో ఫైనల్స్‌లో భారత్ |
| హైదరాబాద్ (ఏజెన్సీ), 17 జులై 2008 ( 12:30 IST ) | |
ఆసియా కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 1-3 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన సెమీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగే ఫైనల్స్‌లో జపాన్‌పై సెమీస్‌లో విజయం సాధించిన దత్తర కొరియాతో భారత్ తలపడనుంది.
సెమీస్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సమిష్టిగా ఆడారు. దివాకర్ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ఆట మొదటి అర్ధభాగంలో గుర్విందర్ సింగ్ చాందీ గోల్ చేసి భారత్‌కు 1-0 ఆధిక్యత అందించాడు.
అనంతరం 38వ నిమిషంలో దివాకర్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యతను 2-0కు పెంచాడు. 42వ నిమిషంలో పాక్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించడంతో భారత ఆధిక్యత 2-1కి తగ్గింది. 47వ నిమిషంలో దివాకర్ మరో గోల్ చేసి భారత్‌కు మూడో గోల్‌ను అందించాడు.
ఇదిలా ఉంటే ఈ సెమీస్ మ్యాచ్ పాక్, భారత్ ఆటగాళ్ల మధ్య ఆవేశాలకు సాక్ష్యంగా నిలిచింది. తోపులాటతో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మొదలైన వివాదం కొట్టుకోవడానికి దారితీసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మ్యాచ్ అధికారులు రంగప్రవేశం చేసి ఇరుజట్ల ఆటగాళ్లను శాంతింపజేశారు. భారత్‌పై మ్యాచ్ పట్టుసాధించడం సహించలేక మొదట పాక్ ఆటగాళ్లే క్రమశిక్షణను ఉల్లంఘించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|