|
| ఇండియానాపోలిస్ క్వార్టర్స్‌లో బొపన్నా- ఖురేషి |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 16 జులై 2008 ( 16:07 IST ) | |
రోహాన్ బోపన్నా (భారత్)- ఐసాం ఉల్ ఖురేషి (పాకిస్థాన్) జోడి అమెరికాలో జరుగుతున్న ఇండియానాపోలిస్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మొదటి రౌండు మ్యాచ్‌లో బోపన్నా- ఖురేషి జోడి ఐగోర్ కునిత్సైన్- దిమిత్రీ తుర్సునోవ్‌లపై విజయం సాధించారు.
ఈ మ్యాచ్‌లో భారత్- పాకిస్థాన్ జోడి 2-6 7-5 10-6 తేడాతో రష్యా ప్రత్యర్థులను ఓడించింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో గతవారం జరిగిన హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ పురుషుల డబుల్స్ బోపన్నా- ఖురేషి జోడి ఫైనల్స్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. తాజా టోర్నీలో తరువాతి మ్యాచ్‌లో ఈ జోడి ఆష్లే ఫిషర్ (ఆస్ట్రేలియా), ట్రిప్ ఫిలిప్స్ (అమెరికా)లతో తలపడతారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి... |
| |
|
|
|
|
|
|
|