యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఐపీఎల్: మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన లక్ష్మణ్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008   ( 12:48 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగే మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ వీవీఎల్ లక్ష్మణ్ గాయం కారణంగా దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న లక్ష్మణ్ గత మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో లేని సంగతి తెలిసిందే.

గాయం నుంచి కోలుకునేందుకు తనకు రెండు వారాలు పట్టనుందని లక్ష్మణ్ విలేకరులతో చెప్పాడు. దీంతో దక్కన్ ఛార్జెర్స్ ఆడే మిగిలిన 5 ఐపీఎల్ మ్యాచ్‌లకు లక్ష్మణ్ పూర్తిగా దూరం అయ్యాడు. కెప్టెన్సీ బాధ్యతలను దక్కన్ ఛార్జెస్ యాజమాన్యం గిల్‌క్రిస్ట్‌కు అప్పగించింది.

బెంగుళూరులో ఈ నెల 3న రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్ష్మణ్ గాయపడ్డాడు. దీంతో లక్ష్మణ్ స్థానంలో తరువాత జరిగిన మూడు మ్యాచ్‌లకు గిల్లీనే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే విజయం సాధించడంపై తమపై యాజమాన్యం ఒత్తిడి లేదని లక్ష్మణ్ చెప్పాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాణించిన అక్తర్: డేర్‌డెవిల్స్‌పై నైట్‌రైడర్స్ విజయం
సెయిల్ ఓపెన్ నుంచి అమృత్‌రాజ్, మన్కాడ్ నిష్క్రమణ
రేపటి ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌లో ఆడనున్న సచిన్
బ్యాటింగ్ వైఫల్యంతోనే పరాజయాలు: రాహుల్ ద్రావిడ్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శామ్యూల్స్‌పై రెండేళ్ల నిషేధం
ఐపీఎల్: బెంగుళూరు రాయల్స్‌కు మరో పరాజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace