|
| రాణించిన అక్తర్: డేర్‌డెవిల్స్‌పై నైట్‌రైడర్స్ విజయం
|
| కోల్‌కత (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 10:11 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై కోల్‌కత నైట్‌రైడర్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈడెన్‌లో మరోసారి రెచ్చిపోయిన అక్తర్ నాలుగు వికెట్లు పడగొట్టి కోల్‌కత నైట్‌రైడర్స్ విజయానికి బాటలు వేశాడు.
కోల్‌కత నైట్‌రైడర్స్ ముందుంచిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఊపుమీదన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ అలోవకగా ఛేదిస్తారని అందరూ భావించారు. అయితే అక్తర్ పరిస్థితిని తారుమారు చేశాడు. మొదటి నలుగురు బ్యాట్స్‌మెన్‌ను తన వేగంతో బోల్తా కొట్టించాడు. అక్తర్‌కు తోడుగా చివర్లో శుక్లా కూడా రాణించడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 18 ఓవర్లలో 110 పరుగులే చేసి ఆలౌటయింది.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులే చేయగలిగింది. డేర్‌డెవిల్స్ బౌలర్లు ప్రత్యర్థిని తక్కువస్కోరుకు కట్టడి చేయడంలో విజయవంతం అయ్యారు. ఓపెనర్ సల్మాన్ భట్ (48), హసి (31) రాణించారు. నైట్‌రైడర్స్ విజయానికి కారకుడైన అక్తర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|