|
| బ్యాటింగ్ వైఫల్యంతోనే పరాజయాలు: రాహుల్ ద్రావిడ్
|
| మొహలీ (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008 ( 16:18 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తమ జట్టు బ్యాటింగ్ లోపాల కారణంగానే పరాజయాల పాలవుతుందని బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు. జట్టు ఎంపిక విషయంలో యజమాని విజయ్ మాల్యా చేసిన విమర్శలపై మాట్లాడేందుకు ద్రావిడ్ నిరాకరించాడు.
తాము సరిగా విజయాలు సాధించలేకపోయాము. ఆయన వ్యాఖ్యలు కూడా వాస్తవమే. రాయల్ ఛాలెంజర్స్‌కు బ్యాటింగ్ ప్రధాన సమస్యగా మారిందని ద్రావిడ్ విలేకరులతో చెప్పాడు. మాల్యా వ్యాఖ్యలపై తాను బహిరంగంగా మాట్లాడాలనుకోవడం లేదు. సెలక్షన్ ప్రక్రియ, ప్రదర్శన రెండూ వేర్వేరు అంశాలు.
ఆటగాళ్లు సరిగా ఆడినప్పుడే జట్టు విజయపథంలో ఉంటుంది. మాల్యా విమర్శలపై తాను సరైన రీతిలో స్పందిస్తానని అన్నాడు. విజయం కోసం రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటివరకు చేసిన యత్నాలన్నీ విఫలం అయ్యాయని ద్రావిడ్ పేర్కొన్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|