|
| ఐపీఎల్: బెంగుళూరు రాయల్స్‌కు మరో పరాజయం
|
| చండీగఢ్ (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008 ( 10:14 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం రాత్రి ఇక్కడ జరిగిన 34వ మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్స్ ఛాలెంజర్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ ఏడింటిలో పరాజయం పాలై సెమీస్‌కు చేరుకునే అవకాశాన్ని దాదాపుగా దూరం చేసుకుంది.
తాజా మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 144 పరుగుల విజయలక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మార్ష్ (74 నాటౌట్) రాణించడంతో కింగ్స్ ఎలెవన్ సునాయస విజయం సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. రాహుల్ ద్రావిడ్ (29), బౌచర్ (39), మిస్బాహ్ (21), కోహ్లి (21)లు ఓ మోస్తారుగా రాణించడంతో రాయల్స్ ఛాలెంజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|