|
| నేననుకున్న రాయల్ ఛాలెంజర్స్ వీళ్లుకాదు: మాల్యా
|
| బెంగుళూరు (ఏజెన్సీ), 12 మే 2008 ( 14:18 IST ) | |
బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ యజామాని విజయ్ మాల్యా సోమవారం ఐపీఎల్‌లో మరో వివాదానికి ఊపిరిపోశారు. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ పరాజయాలకు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, తొలగించబడిన జట్టు సీఈవో చారు శర్మలను బాధ్యులను చేస్తూ మాల్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జట్టు ఎంపిక వంటి కీలక బాధ్యతలను రాహుల్ ద్రావిడ్, చారుశర్మలకు అప్పగించి తెలివితక్కువగా వ్యవహరించానని మాల్యా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత జట్టుతో తాను సంతృప్తికరంగా లేనని మాల్యా చెప్పారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ చివరి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
ట్వంటీ- 20 జెర్సీలో ఉన్న టెస్ట్ జట్టుగా విమర్శలు ఎదుర్కుంటున్న రాయల్ ఛాలెంజర్స్‌తో తాను సంతృప్తికరంగా లేనని మాల్యా స్పష్టం చేశారు. తన దృష్టిలో కొంతమంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాహుల్ ద్రావిడ్, చారుశర్మలను సెలక్షన్ బాధ్యతలను అప్పగించి తెలివితక్కువ పనిచేశానని అన్నారు.
తాను రాయల్ చాలెంజర్స్‌లో ఉండాలనుకున్న ఆటగాళ్లను ద్రావిడ్, శర్మలు పూర్తిగా పట్టించుకోలేదు. వాళ్ల ప్రణాళికల ప్రకారం ఆడారు. తాను ఓ జట్టును సిద్ధం చేసుకోగా, వాళ్లో జట్టును సిద్ధం చేసుకున్నారు. జట్టు ఎంపిక విషయంలో చివరకు తానే వెనుక్కుతగ్గానని మాల్యా ఎన్డీటీవీతో చెప్పారు.
మొదటి వేలం పాటలో కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు తాను ఆవేశపడినప్పటికీ, ద్రావిడ్, చారుశర్మ వెనుక్కులాగారు. దీంతో పరిస్థితులు మరోరకంగా మారిపోయాయని మాల్యా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే రెండోసారి వేలం పాటలోనైనా కోరుకున్నవారిని తీసుకుందామనుకున్నా. ఈసారి ద్రావిడ్ లేనప్పటికీ చారుశర్మ తనను అడ్డుకున్నారని మాల్యా ఆరోపించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|