|
| రోమ్ ఫైనల్స్: అన్‌సీడెడ్ స్టానిస్లాస్ వావ్రింకాతో జకోవిక్ ఢీ
|
| రోమ్ (ఏజెన్సీ), 11 మే 2008 ( 13:44 IST ) | |
రోమ్ మాస్టర్స్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ నోవాక్ జకోవిక్ అన్‌సీడెడ్ స్టానిస్లాస్ వావ్రింకాతో తలపడనున్నాడు. ఆదివారం జరిగే రోమ్ ఫైనల్స్‌లోకి చేరుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు సెమీస్‌లో పెద్దగా కష్టపడలేదు. ప్రత్యర్థులు గాయాలతో వైదొలగడంతో ఎటువంటి శ్రమా లేకుండా వీరు ఫైనల్స్‌లోకి అడుగపెట్టారు.
సెర్బియాకు చెందిన జకోవిక్ శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అన్ సీడెడ్ రాడెక్ స్టెఫాంక్ (చెక్ రిపబ్లిక్)తో తలపడ్డాడు. 6-0, 1-0తో వెనుకబడి ఉన్న స్టెఫాంక్ అర్థంతరంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ముందురోజు క్వార్టర్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌పై స్టెఫాంక్ విజయం సాధించడం గమనార్హం.
ఇదిలా ఉంటే మరో సెమీస్ మ్యాచ్‌లో స్టానిస్లాస్ అమెరికాకు చెందిన ఆరో సీడ్ ఆండీ రాడిక్‌తో తలపడ్డాడు. 3-0తో వెనుకబడి ఉన్న రాడిక్ వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్‌ను నుంచి తప్పుకున్నాడు. దీంతో స్టానిస్లాస్ ఫైనల్స్ జకోవిక్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|