|
| మళ్లీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 09:52 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. కోల్‌కత నైట్ రైడర్స్ విసిరిన లక్ష్యాన్ని అందుకోవడంలో బ్యాట్స్‌మెన్ చూపిన అలసత్వం వారికి మ్యాచ్ చేజారేలా చేసింది.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన నైట్ రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. హస్సీ (12 బంతుల్లో మూడు సిక్సర్లు, ఓ బౌండరీతో 26), గంగూలీ (20)లు చక్కగా రాణించగా, స్టెయిన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ 16 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయడంతో ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఆ జట్టులో బౌచర్ (40 బంతుల్లో ఐదు బౌండరీలు, ఓ సిక్స్‌తో 50పరుగులతో నాటౌట్), క్రెయిగ్ వైట్ (16 బంతుల్లో మూడు బౌండరీలు, ఓ సిక్స్‌తో 30 పరుగులు) రాణించినప్పటికీ, ఓటమి తప్పలేదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|