|
| ఉత్కంఠపోరులో డేర్‌డెవల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 08:52 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠపోరులో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
తద్వారా వరుస పరాజయాల పరంపరకు బ్రేకు లేయడంతో పాటు గత పర్యాయం తమను తమ గడ్డపైనే మట్టి కరిపించిన డేర్ డెవిల్స్ జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. అంతేకాక సెమీస్ చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
గంభీర్ (49 బంతుల్లో ఓ సిక్సర్, 11 బౌండరీలతో 80) శిక్ధర్ ధావన్ (59)ల జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మోర్కెల్, బాలాజీలు రెండేసి వికెట్లు పడగొట్టారు.
విద్యుత్ శివరామకృష్ణన్ (40), ఫ్లెమింగ్ (44)ల జోరుతో దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ఓ దశలో పట్టు వదిలినప్పటికీ, చివర్లో మోర్కెల్ (15 బంతుల్లో 30) చెలరేగడంతో విజయతీరాన్ని చేరుకోగలిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|