|
| రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా సచిన్ దూరం
|
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 7 మే 2008 ( 13:47 IST ) | |
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా దూరం అయ్యే అవకాశాలున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సచిన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడని సంగతి తెలిసిందే.
గజ్జల్లో గాయం కారణంగా ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లన్నింటికీ సచిన్ దూరమయ్యాడు. దీనిపై సచిన్ టెండూల్కర్ మంగళవారం మాట్లాడుతూ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో తాను ఆడటం, ఆడకపోవడంపై ఏమీ చెప్పలేనన్నాడు.
ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు ఫిజియోతో కలిసి కృషి చేస్తున్నానని సచిన్ చెప్పాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించే తప్పుకుండా ఆడతాను. ఐపీఎల్‌లో సాధ్యమైనంత త్వరగా ఆడేందుకు ప్రయత్నిస్తానని సచిన్ తెలిపాడు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడకపోవడంపై తానెటువంటి ఒత్తిడి ఎదుర్కోవడం లేదని సచిన్ స్పష్టం చేశాడు. ముంబయి ఇండియన్స్ అధిపతి ముకేష్ అంబానీ గాయం నుంచి బయటపడటంపై దృష్టిపెట్టమని చెప్పారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించానప్పుడే ఆడతానని సచిన్ తెలిపాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|