|
| టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం: ధోనీ
|
| చెన్నై (ఏజెన్సీ), బుధవారం, 7 మే 2008 ( 11:50 IST ) | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్‌పై ఓటమి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ తమ బ్యాట్స్‌మెన్ కాస్త తొందరపడుతున్నారన్నాడు. ప్రారంభంలోనే షాట్లకు వెళ్లి వికెట్లు చేజార్చుకొని జట్టును ఒత్తిడిలోకి నెడుతున్నారని ధోనీ అభిప్రాయపడ్డాడు.
మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో తిరుగులేని విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను గత మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పలకరించింది. దీంతో చెన్నై కింగ్స్ అగ్రస్థానాన్ని కోల్పోయారు. తాజా మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో దక్కన్ ఛార్జర్స్‌పై ఓడిపోయింది. పరాజయాలపై ధోనీ మాట్లాడుతూ వచ్చే మ్యాచ్ నుంచి తాను బ్యాటింగ్ వరుసలో ముందుకు రానున్నట్టు చెప్పాడు.
తమ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. ముఖ్యంగా వాళ్ల షాట్ల ఎంపికలో తడబాటు కనిపిస్తుందని ధోనీ తెలిపాడు. ఈ తడబాటుతో షాట్ ఆలస్యంగా ఆడి అవుటవుతున్నారు. ఇదిలా ఉంటే జట్టులో పెద్దగా మార్పులు చేసే ఆలోచన తనకు లేదని చెప్పాడు. మూడో స్థానంలో లేదా నాలుగో స్థానంలో తానకు బ్యాటింగ్ చేసే యోచన ఉందన్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|