యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఐపీఎల్: దక్కన్ ఛార్జెర్స్‌కు రెండో విజయం
చెన్నై (ఏజెన్సీ), బుధవారం, 7 మే 2008   ( 09:06 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన 26వ మ్యాచ్‌లో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్‌పై దక్కన్ ఛార్జర్స్ జట్టు ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అర్ధ సెంచరీతో రాణించడంతో దక్కన్ ఛార్జర్స్ తడబాటు లేకుండా ఏడు వికెట్ల తేడాతో విజయతీరాలకు చేరుకుంది. దక్కన్ ఛార్జర్స్‌కు టోర్నీలో ఇది రెండో విజయం.

సుపర్ కింగ్స్ ముందుంచిన 145 పరుగుల విజయలక్ష్యాన్ని దక్కన్ ఛార్జర్స్ జట్టు 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్మణ్‌కు గాయం కారణంగా గిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గిల్లీ (54) అర్ధ సెంచరీకి తోడు స్టైరిస్ (36), రోహిత్ శర్మ (23), అఫ్రిది (20)లు కూడా రాణించి జట్టును విజయపథాన నిలిపారు.

అంతకుముందు టాస్ గెలిచిన గిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన సూపర్ కింగ్స్‌ను రైనా (32), ధోనీ (23), మోర్కెల్ (29) ఆదుకున్నారు. దీంతో సూపర్ కింగ్స్ ప్రత్యర్థి ముందు గౌరవప్రదమైన విజయలక్ష్యాన్ని ఉంచింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు
భజ్జీ వివాదం: ఈ నెల 12న బీసీసీఐకి నానావతి నివేదిక
భారత్ వచ్చిన అక్తర్: ఐపీఎల్‌లో ఆరంగేట్రమే తరువాయి
సచిన్‌ టెండూల్కర్‌కు పద్మ విభూషణ్ పురస్కార ప్రదానం
ఐపీఎల్: రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం
తన్వీర్ రికార్డు బౌలింగ్ ప్రదర్శనకు ధోనీ ప్రసంశ లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace