యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
భజ్జీ వివాదం: ఈ నెల 12న బీసీసీఐకి నానావతి నివేదిక
ముంబయి (ఏజెన్సీ), 6 మే 2008   ( 16:59 IST )
హర్భజన్ సింగ్- శ్రీశాంత్ చెంపదెబ్బ వివాదాన్ని పరిశీలించేందుకు నియమించబడిన సుధీర్ నానావతి దీనిపై సోమవారం తన దర్యాప్తు నివేదికను బీసీసీఐకి అందజేయనున్నారు. నానావతి సోమవారం తన నివేదికను బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్‌కు అందిస్తారు.

భజ్జీ- శ్రీశాంత్ చెంపదెబ్బ వివాదం రికార్డు చేయబడిన వీడియోను నానావతి మంగళవారం వీక్షించారు. నానావతితో పాటు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ, బీసీసీఐ కార్యదర్శులు నిరంజన్ షా, ఎంపీ పాండేవ్‌లు కూడా ఇక్కడి బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ వీడియోను చూశారు.

అనంతరం నానావతి మాట్లాడుతూ ఈ వీడియో తనను నిర్ఘాంతపరిచిందనన్నారు. ఈ వీడియో చూసి షాకయ్యానని, దీని వలన తన పని సులభం అయిందని నానావతి విలేకరులతో చెప్పారు. తదుపరి దర్యాప్తులో తనకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

ఏఫ్రిల్ 25న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చెంపదెబ్బ వివాదం కారణంగా హర్భజన్ సింగ్‌పై‌ 11 మ్యాచ్‌ల నిషేధం విధించబడింది.

దీంతో హర్భజన్ సింగ్‌ ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. అయితే భజ్జీ వివాదంపై దర్యాప్తు జరిపేందుకు బీసీసీఐ నానావతిని నియమించింది. దీనిపై తన నివేదికను ఆదివారంనాటికి నానావతి సిద్ధం చేసి సోమవారం దానిని బీసీసీఐకి సమర్పించనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు
భారత్ వచ్చిన అక్తర్: ఐపీఎల్‌లో ఆరంగేట్రమే తరువాయి
సచిన్‌ టెండూల్కర్‌కు పద్మ విభూషణ్ పురస్కార ప్రదానం
ఐపీఎల్: రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం
తన్వీర్ రికార్డు బౌలింగ్ ప్రదర్శనకు ధోనీ ప్రసంశ లు
ముంబయిపై ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణం: సెహ్వాగ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace