యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
భారత్ వచ్చిన అక్తర్: ఐపీఎల్‌లో ఆరంగేట్రమే తరువాయి
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 6 మే 2008   ( 12:15 IST )
వివాదాస్పద పాకిస్థానీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు సోమవారం భారత్ చేరుకున్నాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు విజయవంతం అవడంతో అక్తర్‌కు ఈ అవకాశం వచ్చింది. పీసీబీ అక్తర్‌పై విధించిన నిషేధాన్ని నెలరోజుల పాటు ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

అక్తర్‌ను షారుక్‌ఖాన్ నేతృత్వంలోని కోల్‌కత నైట్‌రైడర్స్ కొనుక్కుంది. అయితే ఐపీఎల్ ప్రారంభం అవడానికి కొన్ని రోజుల ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అక్తర్‌‌పై ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో ఆటకెక్కిన ఐపీఎల్ అవకాశాలు మళ్లీ శనివారం అక్తర్ తలుపుతట్టాయి.

లాహోర్ నుంచి సోమవారం భారత్‌కు బయలుదేరిన అక్తర్ సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. భారత్‌కు రావటం సంతోషకరంగా ఉందని ఇక్కడకు వచ్చిన అనంతరం అక్తర్ విలేకరులతో చెప్పాడు. తన జట్టుకు పూర్తిస్థాయిలో సేవలు అందించడంపై దృష్టిపెడతానని తెలిపాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సచిన్‌ టెండూల్కర్‌కు పద్మ విభూషణ్ పురస్కార ప్రదానం
ఐపీఎల్: రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం
తన్వీర్ రికార్డు బౌలింగ్ ప్రదర్శనకు ధోనీ ప్రసంశ లు
ముంబయిపై ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణం: సెహ్వాగ్
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ముంబయి ఇండియన్స్ షాక్
ఐపీఎల్: చెన్నై సూపర్ కింగ్స్‌కు రెండో పరాజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace