|
| సచిన్ టెండూల్కర్‌కు పద్మ విభూషణ్ పురస్కార ప్రదానం
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 6 మే 2008 ( 11:43 IST ) | |
మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ సోమవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ అవార్డును అందుకోవడం పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్షణంలో తాను పొందిన ఆనందాన్ని మాటల్లో వ్యక్తీకరించడం కష్టమని సచిన్ పద్మ విభూషణ్ అందుకున్న అనంతరం చెప్పాడు.
18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే ఈ అవార్డు తనకు ప్రత్యేకమైందని, తన సేవలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం సంతోషకరంగా ఉందని తెలిపాడు. అవార్డు ప్రదాన కార్యక్రమానికి హాజరైన సచిన్ భార్య అంజలీ మాట్లాడుతూ ఆయనను చూసి గర్విస్తున్నానని అన్నారు.
సచిన్ ఆడేందుకు అవార్డు అవసరం లేదని అంజలీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో స్విమ్మర్ బులా చౌదరి చక్రవర్తి రాష్ట్రపతి చేతులమీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని అశోకాహాలులో ఘనంగా జరిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం... |
| |
|
|
|
|
|
|
|