|
| రేపు టీడీఎల్పీ సమావేశానికి రానున్న బాబు |
| హైదరాబాద్, బుధవారం, 20 మే 2009 ( 15:50 IST ) | |
ఎన్టీఆర్ ట్రస్టుభవన్ వేదికగా గురువారం జరగనున్న టీడీఎల్పీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సమావేశం కానున్న నేతలు టీడీపీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు.
ఈ విషయమై చర్చించేందుకు ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా గురువారం జరగనున్న సమావేశం గురించి చర్చించడంతో పాటు ఈనెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు ఏర్పాట్లు గురించి కూడా చర్చించారు.
హైదరాబాద్ వేదికగా ఈ రెండు రోజుల మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల గురించి చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|