యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అక్రమ ప్రమోషన్లపై చర్యకు అధికారులు సిద్ధం
హైదరాబాద్, బుధవారం, 20 మే 2009   ( 13:00 IST )
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ప్రమోషన్లు పొందారన్న ఆరోపణల్లో భాగంగా సదరు అభ్యర్థులపై అధికారులు చర్య తీసుకోనున్నారు.

ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ అక్రమ మార్గంలో ప్రమోషన్లు పొందినవారికి రివర్షన్‌తో పాటు సదరు అభ్యర్ధులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సైతం పాఠశాల విద్యాశాఖ సిద్ధమైనట్టు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రమోషన్ల పర్వంలో భాగంగా కొందరు ఉపాధ్యాయులు నకిలీ అర్హత సర్టిఫికేట్లతో ప్రమోషన్లు పొందారు.

ఇలా నకిలీ సర్టిఫికేట్లతో ప్రమోషన్ సాధించినవారు 33మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో 29మంది ఇంగ్లీషు సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందగా, ఒకరు ఫిజికల్ సైన్స్ విభాగంలోను, మరో ముగ్గురు గణితం విభాగంలోనూ ప్రమోషన్లు పొందారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విడుదలను కోరుతూ జైళ్లలో ఖైదీల ఆందోళన
నేడు వైఎస్ ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు పూర్తి
అభిమానులు ధైర్యంగా ఉండాలి: చిరు
అకాల వర్షం: రాష్ట్ర ప్రజలకు కష్టాలు
ప్రజల విశ్వసనీయత కోసం కృషి: వైఎస్
బంధువుల చేతికి బాలస్వామి మృతదేహం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...