|
| విడుదలను కోరుతూ జైళ్లలో ఖైదీల ఆందోళన |
| చర్లపల్లి, బుధవారం, 20 మే 2009 ( 12:59 IST ) | |
ఆరేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న రాజకీయ ఖైదీలను విడుల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతుగా మిగిలిన ఖైదీలు సైతం నిరాహార దీక్షలు చేపట్టడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
పోలీసుల వివరాల ప్రకారం చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బుధవారం ఉదయం నిరాహార దీక్షకు దిగారు. మావోయిస్టు, జనశక్తి ఖైదీలను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని, ఆరేళ్లు శిక్షాకాలం పూర్తి చేసుకున్నవారిని విడుదల చేయాలని ఖైదీలు ఈ నిరాహార దీక్షకు దిగారు. అదేసమయంలో వరంగల్ కేంద్ర కార్యాలయంలోని ఖైదీలు సైతం ఇదే విషయమై నిరాహార దీక్షకు దిగారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|