యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
నేడు వైఎస్ ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, బుధవారం, 20 మే 2009   ( 12:58 IST )
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదేళ్ల క్రితం తొలిసారి ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ రెండోసారి కూడా అదే వేదికనుంచి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనుండడం విశేషం.

వైఎస్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎల్బీ స్టేడియంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్ల గురించి అదనపు డీజీపీ ఏకే. ఖాన్ మాట్లాడుతూ పూర్తి స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు. స్టేడియం భద్రత కోసం నగర పోలీసులతోపాటు అదనంగా జిల్లా పోలీసులను సైతం రప్పించినట్టు తెలిపారు.

దాదాపు రెండు వేలమంది సిబ్బందితో లా అండ్ ఆర్డర్, టాస్క్‌‌ఫోర్స్, బాంబ్ స్క్వాడ్ బృంధాల సాయంతో ఎల్టీ స్టేడియానికి పూర్తి భద్రత కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు కార్యక్రమం జరుగుతున్న సమయంలో మూడు హెలికాప్టర్ల సాయంతో ప్రత్యేక నిఘాను సైతం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అభిమానులు ధైర్యంగా ఉండాలి: చిరు
అకాల వర్షం: రాష్ట్ర ప్రజలకు కష్టాలు
ప్రజల విశ్వసనీయత కోసం కృషి: వైఎస్
బంధువుల చేతికి బాలస్వామి మృతదేహం
మావల్లే కేసీఆర్‌ గెలిచారు: నాగం
సోమనాథ్‌కు ఆ అర్హతలేదు: రాఘవులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...