|
| అకాల వర్షం: రాష్ట్ర ప్రజలకు కష్టాలు |
| హైదరాబాద్, బుధవారం, 20 మే 2009 ( 10:57 IST ) | |
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి కురసిన అకాల వర్షం కారణంగా రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి తోడు ఈదురు గాలులు ఉధృతంగా వీయడంతో మరికొన్ని చోట్ల చెట్లు విరగడం, విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడడంలాంటి ఇబ్బందులు తలెత్తాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 4 మి.మీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో వాహనాలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే గాలులకు చెట్లు విరగడం, హోర్డింగులు విరిగిపడడంలాంటి కారణాలతో మరికొన్ని చోట్ల ట్రాఫిక్కుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల అకాల వర్షం కారణంగా పొలాల్లో నిల్వచేసిన పంట తడిసిపోవడం వల్ల రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. మరికొన్ని చోట్ల గాలి కారణంగా కాపుకు వచ్చిన మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం కలిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|