|
| బంధువుల చేతికి బాలస్వామి మృతదేహం |
| హైదరాబాద్, మంగళవారం, 19 మే 2009 ( 17:58 IST ) | |
హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన హోంగార్డు బాలస్వామి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.
ఉస్మానియా ఆసుపత్రిలో బాలస్వామి మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుల సంఘం హైదరాబాద్ కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ బాలస్వామి రావాల్సిన పరిహారం పూర్తిగా అతని కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
మక్కా మసీదులో పేలుడు సంభవించి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో సోమవారం ఎంఐఎం, పలు స్వచ్ఛంద సంస్థలు సోమవారం సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా గొడవలు జరిగే అవకాశాన్ని ఊహించి ఫలక్‌నుమా ప్రాంతంలో పోలీస్ ఫికెట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఓ హోంగార్డు, కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉండగా బైకుపై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగించారు.
ఉగ్రవాదులపై ప్రతిదాడి చేయడానికి పోలీసుల వద్ద ఆయుధాలేవీ లేకపోవడంతో వారేమీ చేయలేకపోయారు. దీంతో పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడినుంచి పారిపోయారు. ఉగ్రవాదుల కాల్పులకు బలైనవారిలో హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా కానిస్టేబుల్ మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|