|
| మావల్లే కేసీఆర్ గెలిచారు: నాగం |
| హైదరాబాద్, మంగళవారం, 19 మే 2009 ( 17:49 IST ) | |
తమ పార్టీతో పొత్తువల్లే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్‌నగర్‌లో గెలవగలిగారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి పేర్కొన్నారు. అసలు తాము సహకరించకుంటే ఆయన గెలిచేవారా అంటూ ఈ సందర్భంగా నాగం ప్రశ్నించారు. టీడీపీవల్లే తాము ఈ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా నాగం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయమై నాగం మాట్లాడుతూ గత ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు జడ్చర్లలో 20వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని, ఇప్పుడు తమతో పొత్తువల్లే ఆపార్టీకి 60వేల మెజారిటీ వచ్చిందని అన్నారు.
అంతకుముందు రాష్ట్ర ఎన్నికల్లో ఘోరంగా ఓడిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ టీడీపీతో పొత్తువల్లే తమ పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పొత్తు ఉన్నా టీడీపీ కార్యకర్తలు తమ నేతల గెలుపుకు కృషి చేయలేదని విమర్శించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|