|
| సచివాలయం ముట్టడికి ప్రజారాజ్యం యత్నం |
| హైదరాబాద్, గురువారం, 7 మే 2009 ( 16:30 IST ) | |
భోలక్‌పుర్ ఘటనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఉదయం ప్రజరాజ్యం పార్టీ నేతలు సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. భోలక్‌పుర్ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.
భోలక్‌పుర్ వాసులకు సురక్షిత నీటిని తక్షణమే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రరాపా కార్యకర్తలు ఆందోళన చేస్తుండగా పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది. నీటి సమస్యలపై ఫిర్యాదు చేసినాకూడా ప్రభుత్వం పట్టించుకోలేదని, సంబంధిత అధికారులను ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా ప్రరాపా కార్యకర్తలు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిని కలవడానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో సచివాలయంలోకి చొచుకుపోవడానికి తీవ్రప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. పరిస్థితిని చక్కబెట్టడానికి అదనపు బలగాలని మొహరింపజేశారు. కొందరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|